తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా జవహర్‌రెడ్డి

తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గా జవహర్‌రెడ్డిని నియమిస్తూ ఆం ధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 1990 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి జవహార్‌రెడ్డి ప్రస్తుతం వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీగా కొనసాగుతున్నారు. టీటీడీ ఈవోగా ఉన్న అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఇటీవలే బదిలీ అయ్యారు. దీంతో ఈ స్థానంలో జవహర్‌రెడ్డికి ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది.