తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ కాలేజీల్లో సీట్ల భర్తీకి మూడో విడుత దోస్త్ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతున్నది. మూడో విడుతలో ఈ నెల 9 వరకు కొత్తగా రిజిస్ర్టేషన్లు చేసుకోవడానికి గడువు విధించారు. వెబ్ ఆప్షన్లకు పదో తేదీ వరకు అవకాశం కల్పించారు. వాళ్లకు 15న సీట్లు కేటాయిస్తారు. ఇప్పటివరకు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా (మొదటి, రెండో విడుతల్లో) 1,53,547 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. కొత్తగా మరో 24,642 మంది రిజిస్ర్టేషన్ చేసుకున్నారు. మూడో విడుతలో బుధవారం వరకు 57,507 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నట్లు దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు.
