ఆర్జేడీ అధినేత‌, బీహార్ మాజీ ముఖ్య‌మంత్రి లాలూ ప్రసాద్ యాద‌వ్‌కు బెయిల్‌

ఆర్జేడీ అధినేత‌, బీహార్ మాజీ ముఖ్య‌మంత్రి, మాజీ కేంద్ర‌మంత్రి లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌కు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాణా కుంభ‌కోణానికి సంబంధించిన ఓ కేసులో జార్ఖండ్ హైకోర్టు ఈ మేర‌కు ఆదేశాలు జారీచేసింది. అయితే, లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ ఇప్ప‌టికే దాణా కుంభ‌కోణం కేసులో దోషిగా తేలి జైలుశిక్ష అనుభ‌విస్తున్నారు. మ‌రోవైపు దుమ్కా ఖ‌జానా కేసు కూడా ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఈ నేప‌థ్యంలో లాలూకు ప్ర‌స్తుతం బెయిల్ మంజూరైనా జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశం మాత్రం లేదు.