దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గత 24 గంటల్లో కొత్తగా 73,272 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 69,79,424కు చేరింది. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 8,83,185 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 59,88,823 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. నిన్న కొత్తగా 926 మంది కరోనాతో మరణించారు. దీంతో కరోనా మృతులు 1,07,416కు చేరారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
దేశవ్యాప్తంగా నిన్న 11,64,018 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్) తెలిపింది. దీంతో అక్టోబర్ 9 వరకు మొత్తం 8,57,98,698 నమూనాలను పరీక్షించామని వెల్లడించింది.