గుట్కా అక్రమ రవాణా కేసులో సినీ నటుడు, నిర్మాత సచిన్ జోషిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను ముంబైలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సచిన్ జోషీ హైదరాబాద్‌కు భారీగా గుట్కా తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ఆయనపై ఐపీసీ 273,336 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
