యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు. భువనగిరి మండలం నందనం గ్రామ సమీపంలో జిల్లా కలెక్టర్ ప్రయాణిస్తున్నకారును ఓ లారీ ఢీకొట్టింది. కారు తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ అదృష్టవశాత్తు కలెక్టర్ అనితా రామచంద్రన్ ప్రమాదం నుంచి తృటిలో సురక్షితంగా బయటపడ్డారు. అకాల వర్షం వల్ల పలు గ్రామాల్లో నష్టపోయిన పంట పొలాలను కలెక్టర్ పరిశీలించి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
