టీఎ‌స్ఎంసెట్‌ వెబ్‌ ఆప్షన్లకు 22 వరకు గడువు

టీఎ‌స్‌‌ ఎం‌సె‌ట్‌కు సంబం‌ధించి వెబ్‌‌ఆ‌ప్షన్ల ప్రక్రియ ఈనెల 22 వరకు కొన‌సా‌గ‌ను‌న్నట్టు కన్వీ‌నర్‌ నవీన్‌ మిట్టల్‌ తెలి‌పారు. ఇప్పటి వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు 48,446 మంది విద్యా‌ర్థులు హాజ‌ర‌య్యా‌రని పేర్కొన్నారు. ఈ ప్రక్రియ 20వ తేదీ వరకు కొన‌సా‌గు‌తుం‌దని వివ‌రిం‌చారు. సర్టి‌ఫి‌కెట్ల పరి‌శీ‌ల‌నకు హాజ‌రైన విద్యా‌ర్థులు వెబ్‌ ఆప్షన్లు పెట్టు‌కో‌వ‌లని సూచించారు.