మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డికి మంత్రుల పరామర్శ

అపోలో దవాఖానలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డిని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు మంగళవారం పరామర్శించారు. ఆయనతో పాటు వ్యవసాయశాఖమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, హోంమంత్రి మహమూద్‌ అలీ, ఎక్సైజ్‌ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపీ కొత్తప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కూడా నాయినిని పరామర్శించి, ఆరోగ్యపరిస్థితిని తెలుసుకున్నారు.