హైదరాబాద్‌లో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు రేపు సాయంత్రం హైదరాబాద్ నగరానికి కేంద్రం బృందం రానుంది. రెండు రోజుల పాటు హైదరాబాద్‌తో పాటు ఇతర వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి.. నష్టం తీవ్రతను అంచనా వేయనున్నారు. ఈ నెల 13వ తేదీ నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో రూ.వేల కోట్ల మేర నష్టం జరిగినట్లు రాష్ర్ట ప్రభుత్వం అంచనా వేసింది. తక్షణ సహాయంగా రూ.1350 కోట్లను విడుదల చేయాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సీఎం కేసీఆర్ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర బృందం రేపు సాయంత్రం హైదరాబాద్‌కు రానుంది.