గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన ప్రముఖ సింగర్లు మరియు రచయితలు

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన ప్రముఖ సింగర్లు మరియు రచయితలు చంద్రబోస్, విజయ లక్ష్మి, మంగ్లీ, రవి వర్మ, మిట్టపల్లి సురేందర్, స్ఫూర్తి, లెనీన చౌదరి, వేణు, బాలే శావలి
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఛాలెంజ్ ను స్వీకరించి నేడు ఫిల్మ్ నగర్ లో ఉన్న జర్నలిస్ట్ కాలనీలోని సురవరం ప్రతాప్ రెడ్డి మెమోరియల్ పార్క్ వద్ద ప్రముఖ టాలీవుడ్ సింగర్స్ మరియు రచయితలు మొక్కలు నాటారు. ఈ అవకాశం కల్పించిన శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ కి ధన్యవాదాలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం నడుం బిగించిన సంతోష్ కుమార్ కోట్లాది మందిలో కొత్త స్ఫూర్తిని నింపారని కొనియాడారు. తమకు గాయకులుగా, రచయితలుగా వచ్చిన గుర్తింపు కంటే ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా పర్యావరణ ప్రేమికులుగా వచ్చే పేరు ఎంతో సంతృప్తిని ఇస్తుందని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. మహాత్మా గాంధీ స్ఫూర్తిని,ఏపీజే అబ్దుల్ కలాం ఆశయాన్ని కలిపి ముందుకు సాగుస్తున్న ఈ మహాయజ్ఞంలో ప్రతిఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కోఫౌండర్ రాఘవ, , సినీ నటుడు కాదంబరి కిరణ్ మరియు ప్రతినిధి కిశోర్ గౌడ్ పాల్గొన్నారు.