ఆంధ్రప్రదేశ్లో గడిచిన నాలుగురోజులుగా కరోనా ఉధృతి కాస్త తగ్గింది. రాష్ట్రంలో ఇవాళ కొత్తగా 3,746 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 7,739 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇన్ఫెక్షన్ కారణంగా 27 మంది మృత్యువాతపడినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.
రాష్ట్రంలో ఇప్పటివరకు 7,93,299 మంది కరోనా బారినపడగా 7,54,415 మంది చికిత్సకు కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 32,376 మంది చికిత్స పొందుతుండగా 6,508 మంది మృతి చెందారు. గడిచిన 24 గంటల వ్యవధిలో 74,422 మందికి కరోనా పరీక్షలు చేయగా ఇప్పటివరకు 72,71,050 శాంపిళ్లను పరీక్షించినట్లు అధికారులు వెల్లడించింది.