ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన మోహన్ బాబు ఫ్యామిలీ

ఢిల్లీలోని ప్రధాని నరేంద్రమోడీ నివాసంలో ప్రధానితో మోహన్ బాబు ఫ్యామిలీ సమావేశం అయింది. ఈ సమావేశంలో మంచు మోహన్ బాబుతో పాటు మంచు విష్ణు, విరోనిక, మంచు లక్ష్మి పాల్గొన్నారు. దాదాపు ఈ సమావేశం 34 నిమిషాల పాటు సాగింది. అలాగే మరికొంత మంది బిజెపి నాయకులను ఢిల్లీలో కలవనున్న మంచు మోహన్ బాబు కుటుంబం..!