హైదరాబాద్‌ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డికి అవార్డు

ఎల్‌ అండ్‌ టీ మెట్రో రైల్‌ హైదరాబాద్‌ లిమిటెడ్‌ (ఎల్‌టీఎంఆర్‌హెచ్‌ఎల్‌) ఎండీ, సీఈఓ  కేవీబీ రెడ్డికి ప్రతిష్ఠాత్మక అవార్డు దక్కింది. ప్రస్తుత సంవత్సరానికిగాను కన్‌స్ట్రక్షన్‌ వరల్డ్‌ గ్లోబల్‌ అవార్డ్‌ అనే సంస్థ ‘కన్‌స్ట్రక్షన్‌ వరల్డ్‌ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌-2020’ అవార్డుతో సత్కరించింది.  ఈ సందర్భంగా కేవీబీ రెడ్డి మాట్లాడుతూ..  మూడున్నర దశాబ్దాలకుపైగా వృత్తి జీవితంలో చాలా నేర్చుకున్నానని, ఇది ఎంతో ఆనందాన్నిచ్చిందని, ప్రతిష్ఠాత్మకమైన ఈ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు.