ఆంధప్రదేశ్‌లో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో ఇవాళ కొత్తగా 3,345 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 3,572 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇన్‌ఫెక్షన్ కారణంగా 22 మంది మృత్యువాతపడినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.
రాష్ట్రంలో ఇప్పటివరకు 8,04,026 మంది కరోనా బారినపడగా 7,65,991 మంది చికిత్సకు కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 31,469 మంది చికిత్స పొందుతుండగా 6,566 మంది మృతి చెందారు. గడిచిన 24 గంటల వ్యవధిలో 74,919 మందికి కరోనా పరీక్షలు చేయగా ఇప్పటివరకు 75,02,933 మందికి పరీక్షలు పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించింది.