తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు: సీఎం కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రావణుడిపై రాముడు సాధించిన విజయానికి గుర్తుగా దసరా జరుపుకుంటారని ఆయన పేర్కొన్నారు. చెడుపై మంచి సాధించిన విజయమే విజయదశమి అని తెలిపారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో సుసంపన్నమైన జీవితం గడిపేలా ఆశీర్వదించాలని ఆ భగవంతున్ని వేడుకుంటున్నానన్నారు. కరోనా మహమ్మారి అంతం కావాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. అందరూ కొవిడ్‌ నిబంధనలను పక్కాగా పాటిస్తూ పండుగ జరుపుకోవాలని సీఎం కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలను కోరారు.