కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శనివారం పలువురు జిల్లా కలెక్టర్లను బదిలీ చేసింది. ముగ్గురికి స్థానచలనం కల్పించడంతోపాటు మరో ఇద్దరికి అదనపు బాధ్యతలు అప్పగించింది. మెదక్‌కు హన్మంతరావు, సంగారెడ్డికి వెంకట్రామిరెడ్డి, సిద్దిపేటకు భారతీ హోళికెరీని బదిలీ చేసింది. పెద్దపల్లి జిల్లా అదనపు బాధ్యతలు కరీంనగర్ కలెక్టర్ శశాంకకు, మంచిర్యాల అదనపు బాధ్యతలు ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్‌కు అప్పగించింది.