పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖనిలో ఉన్న సింగరేణి గనిలో ప్రమాదం సంభవించింది. దీంతో ఓ కార్మికుడు మృతిచెందాడు. ఆర్జీ-2 పరిధిలోని వకీల్‌పల్లి గనిలో ప్రమాదవశాత్తు నిన్న బొగ్గు బండ కూలింది. దీంతో బొగ్గు పొరల కింద కూరుకుపోయిన నవీన్ కుమార్ అనే కార్మికుడు మరణించాడు. మృతదేహాన్ని రెస్క్యూ టీమ్ ఇవాళ వెలికితీసింది. నిన్న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది. బొగ్గుపొరల కింద చిక్కుకున్న నవీన్ కుమార్ కోసంరెస్క్యూ టీం నిన్న ఆపరేషన్ చేపట్టింది. ఆపరేషన్ ఈరోజు ఉదయం పూర్తయ్యింది.
