కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖలో ఖాళీగా ఉన్న కన్సల్టెంట్ పోస్టలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. నిర్ణీత నమూనాలో ఉన్న దరఖాస్తులను వచ్చే నెల 14 లోపు పంపించాలని కోరింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఐదు పోస్టులను భర్తీ చేయనుంది. వేతనం నెలకు రూ.80 వేలు ఉంటుంది. ఢిల్లీలో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు: 5
ఇందులో ఫారెస్ట్రీ అండ్ వైల్డ్‌లైఫ్‌లో-2, మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ విభాగంలో-1, ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో-1, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్‌లో-1 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హత: సంబంధిత సబ్జెక్టులో పీజీ లేదా డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్. నిర్ణీత నమూనాలో ఉన్న దరఖాస్తులను న్యూఢిల్లీలోని Ministry of Environment, Forest and Climate Change (National Authority)కు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 14
వెబ్‌సైట్: http://moef.gov.in/