ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విస్తరణ కొనసాగుతున్నది. శనివారం కొత్తగా 2,783 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆ రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,23,348కి చేరింది. అందులో 7,92,083 మంది ఇప్పటికే వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మరో 24,575 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా మరణాలు కూడా ఆంధ్రప్రదేశ్‌లో 6,690కి చేరుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ ఈ వివరాలను వెల్లడించింది.
కాగా, కరోనా బారినపడి గత 24 గంటల్లో చిత్తూరులో ముగ్గురు, కృష్ణలో ముగ్గురు, గుంటూరులో ఇద్దరు, విశాఖపట్నంలో ఇద్దరు, పశ్చిమగోదావరిలో ఇద్దరు, అనంతపూర్, తూర్పుగోదావరిల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో అత్యధికంగా పశ్చిమగోదావరిలో 469 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల్లో చిత్తూరు జిల్లా నుంచి అత్యధికంగా 781 మంది మృతిచెందారు.