తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 41,675 కరోనా వైరస్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 1,416 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,40,048కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో ఐదుగురు మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 1,341కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
