రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాగంగా వికారాబాద్ జిల్లా కలెక్టర్ మస్రత్ ఖానం అయేషా మూడు మొక్కలు తన కలెక్టర్ కార్యాలయం లో ఈరోజు ఉదయం నాటడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు సంతోష్ గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారని అందులో కి నన్ను కూడా భాగస్వామి చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు . మొక్కలు నాటడమే కాకుండా వాటిని ఎదిగే వరకు సంరక్షించే బాధ్యత కూడ అందరం తీసుకోవాలని కోరారు. పర్యావరణ పరిరక్షణ కోసం సంతోష్ కుమార్ చేపట్టిన ఈ గ్రీన్ ఛాలెంజ్ లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని , ప్రతి ఒక్కరు మొక్కలు నాటడం ఒక అలవాటు గా చేసుకోవాలని కోరారు. వారు మరో ముగ్గురిని నామినేట్ చేశారు జిల్లా సబ్ కలెక్టర్, ఆర్డీవో మరియు జిల్లా ఎస్పీని మూడు మొక్కలు నాటాలని కోరారు.