నిర్మల్ జిల్లాలోని బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవీ అమ్మవారి దేవస్థానంలో హుండీల లెక్కింపు ప్రారంభమైంది. హుండీల లెక్కింపు కార్యక్రమం ఆలయ ఈవో వినోద్ రెడ్డి, ఆలయ చైర్మన్ శరత్ పాఠక్, హుండీ పరిశీలకులు రాజేందర్ రావు, ఆలయ ఏఈవో సుదర్శన్ గౌడ్, ఇంచార్జ్ పర్యవేక్షకులు సంజీవ్ రావు, ఆలయ అకౌంటెంట్ శివరాజ్, ఆలయ ఇంచార్జ్ నారాయణ పటేల్, పీఆర్వో గోపాల్ సింగ్, సీనియర్ అసిస్టెంట్ శైలేష్‌తో పాటు ఆలయ సిబ్బంది, పోలీసుల సమక్షంలో జరుగుతుంది.
