ఏపీలో కొత్తగా 2,849 కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,849 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడిన వారిలో 3700 మంది కోలుకున్నారు. 15 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు.

ఏపీలో ఇప్పటివరకు 8,30,731 మంది కరోనా బారినపడగా వీరిలో 8,02,325 మంది చికిత్సకు కోలుకున్నారు. మరో 21,672 మంది దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఇన్‌ఫెక్షన్ల కారణంగా ఇవాళ్టి వరకు 6734 మంది మృత్యువాతపడ్డారు. గడిచిన 24 గంటల్లో  రాష్ట్రవ్యాప్తంగా 84,534 మందికి కోవిడ్‌ పరీక్షలు చేయగా ఇప్పటివరకు 82,66,820 మందికి పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.