విద్యుత్ శాఖామంత్రి జగదీష్ రెడ్డిని పరామర్శించిన: మంత్రి హరీష్ రావు, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

అస్వస్థతకు గురైన రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డిని రాష్ట్ర ఆర్థిక శాఖామంత్రి హరీష్ రావు, రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పరామర్శించారు. మంత్రి జగదీష్ రెడ్డి నివాస గృహానికి వెళ్లి జగదీష్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తుంగతుర్తి శాసనసభ్యులు గాధారి కిశోర్ కుమార్, ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు మంత్రిని పరామర్శించారు.