పేద వర్గాలు కూడా గొప్పగా బతకాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన విషయం విదితమే. ఇప్పటికే అర్హులైన పేదలకు పలుచోట్ల డబుల్ బెడ్ రూం ఇండ్లను పంపిణీ చేశారు. చాలా చోట్ల ఆ ఇండ్ల నిర్మాణ పనులు శర వేగంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. జీహెచ్ఎంసీ సహా పట్టణ ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఇండ్ల నిర్మాణం కోసం రూ. 600 కోట్ల నిధులు విడుదల చేస్తూ గృహ నిర్మాణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
