న‌్యాయ విద్యలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన లాసెట్ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి ఫలితాలను ప్రకటిస్తారు. ఈ ప్రవేశ అక్టోబర్ 9న నిర్వహించారు. మొత్తం 30,310 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 21559 మంది పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్ష ద్వారా మూడేండ్ల కాలవ్యవధి కలిగిన ఎల్ఎల్‌బీ, ఐదేండ్ల కాలవ్యవధికలిగిన ఎల్ఎల్‌బీ ఆనర్స్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. లాసెట్‌తోపాటు ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాలకోసం నిర్వహించిన పీజీఎల్‌సెట్ ఫలితాలను కూడా వెల్లడించనున్నారు. ఈ ప్రవేశ పరీక్షలను ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించింది.
