తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులపై ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. ఉదయం 11:30 గంటల సమయంలో ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ఈ విషయాన్ని వెల్లడించారు. తెలంగాణ చరిత్రలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ప్రకటించినందుకు సంతోషంగా ఉందని కేటీఆర్ ట్వీట్ చేశారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్(AWS) రాష్ర్టంలో రూ. 20,761 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. తెలంగాణలో పలు ప్రాంతాల్లో డేటా కేంద్రాలను అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్లో 2022లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ సంస్థ తన కార్యకలాపాలను ప్రారంభించే అవకాశం ఉంది.
