దూలపల్లి పారిశ్రామికవాడలో శుక్రవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పారిశ్రామిక వాడలోని బ్లిస్ ఎంటర్ ప్రైజెస్ రబ్బర్ పరిశ్రమలో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు భారీగా ఎగసిపడుతుండటంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు రంగంలోకి దిగి మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. లక్షల్లో ఆస్తినష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఏ మేరకు నష్టం వాటిల్లిందో ఇప్పుడే చెప్పలేని అధికారులు పేర్కొన్నారు. ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
