రాణె బ్రేక్ లైనర్స్ కంపెనీలో పనిచేస్తున్న ప్రజ్ఞాపూర్ గ్రామానికి చెందిన చెర్ల ఎల్లాగౌడ్ ప్రమాదవశాత్తు శుక్రవారం మృతిచెందాడు. రాత్రి షిఫ్ట్‌లో పనిచేస్తున్న ఎల్లాగౌడ్ కట్టర్ మార్పు సమయంలో జరిగిన ప్రమాదంలో తల, చేతికి బలమైన గాయాలయ్యాయి. దీంతో తోటి కార్మికులు కంపెనీ అంబులెన్స్‌లో సికింద్రాబాద్ యశోద దవాఖానకు తరలించగా, వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. ఎల్లాగౌడ్ మృతదేహాన్ని గజ్వేల్ దవాఖానలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఎల్లాగౌడ్తోపాటు మరో కార్మికుడు పల్లె మల్లేశంకు కూడా గాయాలు అయ్యాయి. ఎల్లాగౌడ్ కంపెనీలో పనిచేస్తూనే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు. వివిధ సందర్భాల్లో రక్తదాన శిబి రాలు నిర్వహించడమే కాకుం డా పలుమార్లు రక్తదానం చేశాడు. ఇందుకు గాను గతం లో గవర్నర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నాడు. తెలంగాణ ఉద్యమ సమయంలో అతడు ఉద్యమకారులకు అండగా నిలిచాడు. టీఆర్ఎస్కేవీ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. ఎల్లాగౌడ్ మృతిపై మంత్రి హరీశ్‌రావుతోపాటు ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, నాయకులు ఎలక్షన్‌రెడ్డి, భూం రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, మాజీ చైర్మన్ భాస్కర్, మాదాసు శ్రీనువాస్ తదితరులు విచారం వ్యక్తం చేశారు.
ఎల్లాగౌడ్ మృతి తీరని లోటు : మంత్రి హరీశ్‌రావు
ఎల్లాగౌడ్ మృతి పార్టీకి తీరని లోటు అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందడం తనకు ఎంతో బాధను కలిగించిందన్నారు. కుటుంబానికి ప్రభుత్వం, పార్టీ అండగా ఉంటుందన్నారు. ఎల్లాగౌడ్ మృతి సమాచారం తెలుసుకున్న మంత్రి హరీశ్‌రావు సదరు కంపెనీ యజమాన్యానికి ఫోన్ చేసి కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని ఆదేశించారు. అతడి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు.
పార్టీలో చురుకైన కార్యకర్త : ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి
ఎల్లాగౌడ్ పార్టీలో చురుకైన కార్యకర్త అని, కుటుంబం కోసం కంపెనీలో ఉద్యోగం చేస్తూనే ప్రజాసేవలో కీలక పాత్ర పోషించారని ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి అన్నారు. గజ్వేల్ ప్రభుత్వ దవాఖాన వద్ద ఎల్లగౌడ్ మృతదేహాన్ని చూసి కన్నీరు పెట్టుకున్నారు. మృతుడి కుటుంబాన్ని ఓ దార్చారు. పార్టీ పరంగా ప్రమాద బీమా వర్తింస్తుందన్నారు.