ప్రేమ పేరుతో మోసం చేసిన ఎస్ఐపై స‌స్సెన్ష‌న్ వేటు

పెద్ద‌ప‌ల్లి జిల్లా రామ‌గుండం సీసీఎస్ ఎస్ఐ దుర్గం మ‌హేంద‌ర్‌ను విధుల నుంచి స‌స్పెండ్ చేస్తూ క‌రీంన‌గ‌ర్ ఇన్‌ఛార్జి డీఐజీ ప్ర‌మోద్ కుమార్ ఆదివారం ఉత్త‌ర్వులు జారీచేశారు. గతంలో వరంగల్ కమిషనరేట్ పరిధిలోని సుబేదారి పోలీస్ స్టేష‌న్ ఎస్ఐగా విధులు నిర్వహించే సమయంలో ఓ యువ‌తిని ప్రేమ పేరుతో మోసం చేసినట్లుగా ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. శాఖ‌ప‌ర‌మైన విచార‌ణ‌లో యువతిని ప్రేమ పేరుతో మోసం చేసినట్లుగా నిర్థారణ అయింది. సదరు ఎస్ఐపై సుబేదారి పోలీస్ స్టేషన్ లోనే అత్యాచారం కేసు నమోదు అయింది. దీంతో డీఐజీ ప్ర‌మోద్ కుమార్ చ‌ర్య‌లు చేప‌డుతూ మ‌హేంద‌ర్‌ను విధుల నుంచి స‌స్పెండ్ చేశారు.