అడ‌వుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు అటవీ శాఖ హెల్ప్‌లైన్‌

తెలంగాణ రాష్ట్రంలోని అడ‌వుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు అటవీ శాఖ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. అట‌వీ‌ప్రాం‌తాల్లో అగ్ని‌ప్ర‌మా‌దాల నుంచి అప్ర‌మత్తం చేయ‌డా‌నికి, ఫిర్యా‌దుల స్వీక‌ర‌ణకు కొత్తగా హెల్ప్‌‌లైన్‌, వాట్సాప్‌ నంబర్ 9803338666ను ఏర్పాటు చేశామ‌ని, ఇక‌పై దీని ద్వారా స‌మాచారం ఇవ్వాల‌ని సూచించింది. అటవీ క్రైమ్‌ కంట్రోల్‌ టోల్‌ ఫ్రీ నెంబరు 1800425 5364కు కూడా ఫోన్‌ చేయొచ్చని ప్రిన్సి‌పల్‌ చీఫ్‌ కన్జ‌ర్వే‌టర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ అండ్‌ హెచ్‌‌వో‌ఎ‌ఫ్‌‌ఎఫ్‌ చైర్మన్‌ ఆర్‌ శోభ తెలిపారు. జన‌వరి నుంచి ఎక్కు‌వగా అగ్ని‌ప్ర‌మా‌దాలు జరిగే అవ‌కా‌శా‌లు‌న్నం‌దున వాటిని ఎదు‌ర్కొ‌నేం‌దుకు సిబ్బంది సిద్ధంగా ఉండి, మంట‌లను నివా‌రిం‌చా‌లని ఆదేశించారు.