ఈ నెల 14న తిరుమలలో దీపావళి ఆస్థానం

ఈ నెల 14న తిరుమల శ్రీవారి ఆలయం లో ‘దీపావళి ఆస్థానాన్ని’ నిర్వహించనున్నట్టు టీటీడీ తెలిపింది. ప్రతి ఏటా ఆశ్వయుజ బహుళ అమావాస్య (దీపావళి) రోజున స్వామివారికి సుప్రభాతం నుంచి మొదటి గంట నివేదన వరకు కైంకర్యాలు నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 7 గంటల నుంచి 9 వరకు బంగారు వాకిలి ముందు ఘంటా మండపంలో దీపావళి ఆస్థానం జరుగుతుంది. సాయంత్రం  శ్రీదే వి, భూదేవి సమేత మలయప్ప స్వామివారు సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొని, ఆలయ మాడ వీధుల్లో ఊరే గుతారు. దీపావళి ఆస్థానం నేపథ్యంలో 14న కల్యాణోత్స వం, ఊంజల్‌ సేవ, బ్రహ్మోత్సవ ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.