ఓయూ ‘లా కోర్సుల’ ఫ‌లితాలు విడుద‌ల‌

సెప్టెంబర్, అక్టోబర్‌-2020లో జ‌రిగిన ప‌లు లా కోర్సుల తుది సెమిస్ట‌ర్ ప‌రీక్ష ఫ‌లితాల‌ను ఉస్మానియా విశ్వవిద్యాలయం గురువారం వెల్ల‌డించింది. ఎల్‌ఎల్‌బీ(మూడేళ్లు) 6 వ సెమిస్టర్ (రెగ్యులర్/ బ్యాక్‌లాగ్), ఎల్‌ఎల్‌బీ (ఆనర్స్) మూడేళ్లు 6వ సెమిస్టర్ (రెగ్యులర్/ బ్యాక్‌లాగ్), బీబీఏ ఎల్‌ఎల్‌బీ (5 ఏళ్లు) 10వ సెమిస్టర్ (రెగ్యులర్/ బ్యాక్‌లాగ్), బీకాం ఎల్‌ఎల్‌బీ (5 ఏళ్లు) 10వ సెమిస్టర్ ( రెగ్యులర్/ బ్యాక్‌లాగ్) ఫ‌లితాల‌ను ఓయూ ప్ర‌క‌టించింది. ఫ‌లితాల వివ‌రాలు వ‌ర్సిటీ వెబ్‌సైట్‌ www.osmania.ac.in లో అందుబాటులో ఉన్న‌ట్లు తెలిపింది.