వాటర్ మ్యాన్ ఆఫ్ తెలంగాణగా పేరొందిన దివంగత ఇంజినీర్ ఆర్ విద్యాసాగర్‌రావు విగ్రహాన్ని ఇంజినీర్స్‌భవన్‌లో శనివారం ఆవిష్కరించనున్నారు. తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం, హైదరాబాద్ ఇంజినీర్ల సంఘం, తెలంగాణ ఇరిగేషన్ గ్రాడ్యుయేట్ ఇంజినీర్ల సంఘం, తెలంగాణ ఇంజినీర్ల జేఏసీ, తెలంగాణ అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ల సంఘం, ఆర్ విద్యాసాగర్‌రావు ఇంజినీర్స్‌భవన్ కమిటీ ఆధ్వర్యంలో విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నారు. రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఇరిగేషన్‌శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ రజత్‌కుమార్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
