తెలంగాణలో పలువురు కలెక్టర్ల బదిలీ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలువురు జిల్లా కలెక్టర్లను బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. సంగారెడ్డి కలెక్టర్‌గా ఉన్న పీ వెంకటరామిరెడ్డిని సిద్దిపేటకు బదిలీ చేసిన ప్రభుత్వం ఆయనకు అదనంగా మెదక్‌ జిల్లా బాధ్యతలను కూడా అప్పగించింది. మెదక్‌ కలెక్టర్‌గా ఉన్న ఎం హనుమంతరావును సంగారెడ్డికి బదిలీ చేసింది. సిద్దిపేట జిల్లా కలెక్టర్‌గా ఉన్న భారతి    హోళికేరిని మంచిర్యాలకు బదిలీచేసి, పెద్దపల్లి జిల్లా బాధ్యతలను కూడా అప్పగించింది. మేడ్చల్‌-మల్కాజిగిరి కలెక్టర్‌గా ఉన్న డాక్టర్‌ వీ వెంకటేశ్వర్లును బదిలీ చేసిన ప్రభుత్వం ఆ బాధ్యతలను హైదరాబాద్‌ కలెక్టర్‌ శ్వేతా మొహంతీకి అప్పగించింది. డాక్టర్‌ వెంకటేశ్వర్లును ప్రభుత్వం హోల్డ్‌లో ఉంచింది.