తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ (టీఎస్‌టీడీసీ)గా హైదరాబాద్‌కు చెందిన ఉప్పల శ్రీనివాస్‌గుప్తా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. శ్రీనివాస్‌గుప్తా ఈ పదవిలో రెండేండ్లపాటు కొనసాగనున్నారు. శ్రీనివాస్‌గుప్తా టీఆర్ఎస్లో క్రియాశీలక పాత్ర పోషిస్తుండటంతోపాటు ఆర్యవైశ్య సంఘం నాయకుడిగా పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వర్తిస్తున్నారు. ఆయన సేవలను గుర్తించి ముఖ్యమంత్రి కేసీఆర్ సముచిత స్థానం కల్పించారు. ఆయన నియామకంపై టీఆర్ఎస్ నేతలు హర్షం వ్యక్తంచేశారు. చైర్మన్‌గా నియమితులైన శ్రీనివాస్గుప్తాకు పలువురు నేతలు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.
