ఆస్తిపన్ను రాయితీ, సఫాయి కార్మికుల జీతాల పెంపునకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. 2020-2021లో ఆస్తి పన్నులో రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం నిన్న నిర్ణయం వెలువరించిన సంగతి తెలిసిందే. జీహెచ్‌ఎంసీ పరిధిలో రూ. 15 వేల వరకు ఆస్తి పన్ను ఉన్న వారికి 50 శాతం రాయితీ అదేవిధంగా రాష్ట్రంలోని ఇతర పట్టణాల్లో రూ.10 వేల పన్ను ఉన్న వారికి 50 శాతం రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం వెలువరించింది. ఇప్పటికే ఆస్తిపన్ను చెలించిన వారికి వచ్చే ఏడాది సర్దుబాటు చేయనున్నారు. అదేవిధంగా జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల వేతనాన్ని రూ. 14,500 నుంచి రూ. 17,500కి పెంచింది. ఈ రెండింటింకి సబంధించిన అధికారిక ఉత్తర్వులను ప్రభుత్వం నేడు వెలువరించింది.
