ఆంధ్రప్రదేశ్ వైసీపీ ఎంపీ రఘురాం కృష్ణంరాజు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన హరితహారంలో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టడం చాలా మంచి కార్యక్రమమని అన్నారు. మొక్కలు లేనిది మానవాళి లేదు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఒక్క మహత్తర ఉద్యమంగా మారి బంగారు తెలంగాణలో భాగంగా హరిత తెలంగాణగా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
మిషన్ భగీరథ, మిషన్ కాకతీయతో తెలంగాణలో చక్కటి, పచ్చటి తెలంగాణ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఎంపీ రఘురాం కృష్ణంరాజు అన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజలందరి సహకారం ఉండాలని కోరారు. హీరో బాలకృష్ణ, సినీ నిర్మాత అశ్విన్ దత్, మాజీ క్రికెట్ ప్లేయర్ చాముండేశ్వర్ నాథ్ కు నేను గ్రీన్ ఛాలెంజ్ చేస్తున్నానని చెప్పారు. వారు కూడా మొక్కలు నాటాలని కోరారు.