మంచిర్యాల కలెక్టర్గా భారతీ హోళికేరి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. జిల్లా సమగ్రాభివృద్ధి, విద్య, వైద్యంతో పాటు జిల్లా అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పారు. ఇక్కడ కలెక్టర్గా విధులు నిర్వహిస్తుండగా, దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో సిద్దిపేటకు బదిలీ అయ్యారు. అనంతరం తిరిగి ఇక్కడికే కలెక్టర్గా బదిలీపై వచ్చారు.
