రేపు టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ, లెజిస్లేచర్‌ పార్టీ సమావేశం

టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ, లెజిస్లేచర్‌ పార్టీ సమావేశం రేపు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరగనుంది. సమావేశానికి పార్టీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విధిగా హాజరు కావాలని సీఎం ఆదేశించారు. మంత్రులు తమ జిల్లాలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సమన్వయం చేసుకుని సమావేశానికి తీసుకురావాల్సిందిగా సూచించారు.