వినియోగదారుడి నుంచి రూ. 13 వేలు లంచం తీసుకుంటూ విద్యుత్ సబ్‌ఇంజినీర్లు ఏసీబీ అధికారులకు చిక్కారు. ఈ ఘటన మే డ్చల్ జిల్లా నాగారంలోని డీఈ కార్యాలయంలో మంగళవారం చోటుచేసుకున్నది. నాగారం పరిధిలో ట్రాన్స్‌ఫార్మర్, మీటర్ కోసం శశికుమార్ దరఖాస్తు చేసుకున్నారు. ఫైల్ డీఈ కార్యాలయంలో ఆగింది. శశికుమార్ అధికారులను సంప్రదించగా.. రూ.13 వేలు డిమాండ్ చేశారు. మంగళవారం సబ్ ఇంజినీర్లు విజయేందర్‌రెడ్డి, సంతోష్ రూ.13 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
