ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 1,236 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. గత 24 గంటల్లో 9 మంది మృత్యువాత పడినట్లు ఆ రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ తన బులెటిన్‌లో పేర్కొన్నది. తాజా కేసులతో కలిపి ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 8,57,395కి చేరింది. ఇప్పటివరకు 6,899 మంది మృత్యువాతపడ్డారు. ఇక, గత 24 గంటల్లో మరో 1,696 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ఏపీలో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 8,33,980 చేరింది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 16,513 యాక్టివ్ కేసులున్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో 69,618 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 93,33,703 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లయ్యింది.
