గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో ఖైరతాబాద్ఎమ్మెల్యే దానం నాగేందర్ మొక్కలు నాటారు. ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్ పెరుగుతున్న నేపథ్యంలో ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం తీసుకోవడం అభినందనీయమన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఇందులో పాల్గొన్నారని చెప్పారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్, సినీ నిర్మాత దిల్ రాజు, ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ముషారఫ్ అలీకి గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర కాలనీ కార్పొరేటర్ మన్నే కవిత, బంజారాహిల్స్ పోలీస్ సిబ్బంది, కంగారూ కిడ్స్ స్కూల్ చిన్నారులు, టీచర్లు పాల్గొన్నారు.