గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో పోటీ చేసే తొలి జాబితాను టీఆర్‌ఎస్ విడుదల చేసింది. 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తూ బుధవారం సాయంత్రం తొలి జాబితా విడుదల చేసింది. అంతకు ముందు సీఎం కేసీఆర్ టీఆర్‌ఎస్ ప్రజప్రతినిధులతో సమావేశమయ్యారు. ఎన్నికల్లో పార్టీ వ్యూహాన్ని వివరించారు. ప్రతిపక్షాలను విమర్శలను ఎలా తిప్పికొట్టాలో దిశానిర్దేశం చేశారు. సర్వేలన్నీ తమకు అనుకూలంగా ఉన్నాయని, 110 సీట్లకు పైగా టీఆర్‌ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
