కామారెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్ జగదీశ్ నివాసంపై అవినీతి నిరోధకశాఖ అధికారులు శుక్రవారం రైడ్ చేశారు. అవినీతి ఆరోపణలపై ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. నిజామాబాద్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ పర్యవేక్షణలో ఏడుగురు సభ్యులు గల అధికారుల బృందం కామారెడ్డిలోని సీఐ నివాసంలో సోదాలు నిర్వహించి రికార్డులన్నింటినీ పరిశీలించింది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న జగదీశ్ బంధువుల నివాసాల్లో కూడా సోదాలు చేపట్టినట్లు ఆనంద్ కుమార్ తెలిపారు. విచారణ కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.
