పల్లెలన్ని పచ్చదనంతో కళకళలాడాలి-సూర్యాపేట జిల్లా కలెక్టర్ డి. అమయ్ కుమార్

ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా మూడు మొక్కలు నాటండి – సూర్యాపేట జిల్లా కలెక్టర్ డి. అమయ్ కుమార్
నల్లగొండ కలెక్టర్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను సవాలుగా తీసుకున్న జిల్లా కలెక్టర్ డి. అమయ్ కుమార్
జిల్లాలోని పల్లెలన్ని పచ్చదనంతో కళకళలాడే విధంగా ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మూడు మొక్కలు నాటి మరొకరికి స్ఫూర్తినివ్వాలని జిల్లా కలెక్టర్ డి. అమయ్ కుమార్ పిలుపునిచ్చారు. నల్లగొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ హరితహారంలో భాగంగా జిల్లా కలెక్టర్ డి. అమయ్ కుమార్ కు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. ఆ ఛాలెంజ్ ను సవాలు తీసుకున్న ఆయన సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం సీతారాంపురంలో మూడు ముక్కలు నాటి అనంతరం ముగ్గురు 1) ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్, 2) వరంగల్ అర్భన్ కలెక్టర్ జీవన్ పాటిల్, 3) జనగాం జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణ రెడ్డిలను భాగస్వాములను చేస్తూ గ్రీన్ ఛాలెంజ్ విసిరారు.ఈ కార్యక్రమంలో ఆయన వెంట గ్రామ సర్పంచ్, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.