జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారాన్ని టీఆర్ఎస్ విస్తృతం చేసింది. గత గ్రేటర్ ఎన్నికల్లో అన్నీ తానై టీఆర్ఎస్ను గెలిపించిన కేటీఆర్.. ఈసారి కూడా గెలుపు బాధ్యతను తన భుజాలపై వేసుకున్నారు. అన్నితానై పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు. ఈ నెల 30వ తేదీ వరకు జీహెచ్ఎంసీ పరిధిలోని 20 నియోజకవర్గాల్లో మంత్రి కేటీఆర్ రోడ్‌షోలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలిసింది. శనివారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో రోడ్ షోతో కేటీఆర్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అనంతరం కూకట్‌పల్లిలో ప్రచారం నిర్వహించి.. సాయంత్రం 5 గంటలకు ఓల్డ్ అల్లాపూర్ చౌరస్తా, చిత్తారమ్మ తల్లి చౌరస్తా, రాత్రి 7గంటలకు ఐడీపీఎల్ చౌరస్తా, 8 గంటలకు సాగర్ హోటల్లో జంక్షన్లో ప్రచారం నిర్వహించారు. ఆదివారం మంత్రి కేటీఆర్ ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించనున్నారు.
కేటీఆర్ షెడ్యూల్ ఇలా..
ఖైరతాబాద్ నియోజకవర్గం : జహీరానగర్ చౌరస్తాలో సాయంత్రం 4 గంటలకు, ఖైరతాబాద్ లైబ్రరీ చౌరస్తాలో 5 గంటలకు రోడ్డుషోలో పాల్గొంటారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం : శ్రీరామ్ నగర్ చౌరస్తాలో సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు.. యూసఫ్ గూడ చెక్ పోస్ట్ చౌరస్తాలో రాత్రి 7:30 గంటలకు మంత్రి కేటీఆర్ రోడ్డు షోలో పాల్గొంటారు.