మహబూబాబాద్ జిల్లాలోని పెద్దవంగర మండలం చిట్యాల గ్రామం నుంచి అక్రమంగా తరలిస్తున్న 75 బస్తాల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. తొర్రూరు గ్రామ శివారు పాల కేంద్రం వద్ద వాహనాల తనిఖీల్లో భాగంగా బియ్యం పట్టుబడింది. 75 బస్తాల రేషన్ బియ్యం, ఒక వాహనం, ఒక బైక్‌తో పాటు నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
