రేపు ఉదయం 10:40 గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తిరుపతి చేరుకుంటారని, మధ్యాహ్నం 3 గంటలకు తిరుగు ప్రయాణమవుతారని చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్‌గుప్తా తెలిపారు. ఉదయం 1 0.40 గంటలకు తిరుపతి చేరుకుంటారని, ఉదయం 11 గంటలకు తిరుచానూరు పద్మావతీ అమ్మవారిని దర్శించుకుంటారని తెలిపారు. అనంతరం మధ్యాహ్నం కుటుంబసమేతంగా శ్రీవారిని రాష్ట్రపతి రామ్‌నాథ్ దర్శించుకోనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారని, అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్‌కు వెళ్తారని చెప్పారు. మరోవైపు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తిరుమలకు రానున్న నేపథ్యంలో అధికారులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
