కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ మృతికి ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నమ్మకమైన సహోద్యోగి, స్నేహితుడిని కోల్పోయామన్నారు. ఆయన జీవితమంతా కాంగ్రెస్ పార్టీకి అంకితం చేశారన్నారు. పటేల్ అంకిత భావం, తన కర్తవ్యం పట్ల ఆయనకున్న నిబద్ధత, సహాయం అందించేందుకు ఎల్లప్పడూ ముందండడం, ఔదార్యం ఆయనకున్న అరుదైన లక్షణాలన్నారు. ఈ సందర్భంగా ఆయన మృతికి సంతాపం ప్రకటించారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.
